మనవార్తలు ,పటాన్ చెరు:
నిరుపేదలకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తితే మెరుగైన చికిత్సను అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు నాలుగు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ మంజూరైంది. మంగళవారం ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా వెంకటేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఎల్వోసీ అనుమతి పత్రాలు అందజేశారు అందజేశారు.