పటాన్చెరు
పటాన్చెరు పట్టణానికి చెందిన అంజాద్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటేశ్, మేరజ్ ఖాన్, షకీల్, కృష్ణ కాంత్, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.