ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు
మనవార్తలు , పటాన్ చెరు:
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న 62 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు హారిక విజయ్ కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.