పటాన్చెరు
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 258 చర్చిలకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కేకులను పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ఆయా చర్చిల ప్రతినిధులకు అందజేశారు. నియోజకవర్గంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ప్రమోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.