పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
బిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా ఇటీవల నియమితులైన పులిమామిడి నారాయణ ను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు. మంగళవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా అంతర్జాతీయ పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్మికుడికి వర్తించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.