ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుడు కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మగ్దంపూర్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి గత కొద్ది రోజుల క్రితం జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని ఆరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధుల్లో చేరాడు. ఇటీవల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కార్మికుడికి న్యాయం చేయాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.