పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాదులోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారులు గూడెం సందీప్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డిలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షీ, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.