నిధుల దుర్వినియోగం అవాస్తవం …
– కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ
పటాన్ చెరు :
పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని ఖండిచారు. వారు ఏ ఉద్దేశంతోని ఆరోపణలు చేస్తున్నారు అర్థం కావడం లేదని, గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు అందరూ వార్డు సభ్యులతో కలిసి పని చేస్తామని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టి, ఏమైనా తప్పులు జరిగితే వాటికి బాధ్యత వహిస్తామని వారు పేర్కొన్నారు.