మనవార్తలు , శేరిలింగంపల్లి :
నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు.
పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ ది ప్రత్యేకమైన పాత్ర ఉందన్నారు. ఏ పార్టీకి కోమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుందని, అందుకు పాతికేయులు నిష్పక్షపాతoగా పని చేయాలన్నారు ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరి నర్సింలు ముదిరాజ్, ఎన్ ప్రసాద్, పి.గోపాల్ ఎం శ్రీనివాస్, డి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.