నవతెలంగాణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

నవతెలంగాణ దినపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను సోమవారం రోజు 76 వ స్వాతంత్ర్య వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. పత్రిక ముందు ముందు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో గచ్చిబౌలి డివిజన్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాఫర్ సైదులు, శేరిలింగంపల్లి రిపోర్టర్ నర్సింలు ముదిరాజ్, మణికొండ రవి, చందానగర్ లక్ష్మీ కాంత్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *