Telangana

చాకలి ఐలమ్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన నీలం మ‌ధు ముదిరాజ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీల‌క‌ భూమిక వ‌హించిన‌ చాకలి ఐలమ్మ 128 వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మ‌ధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ జయంతోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు మంత్రి కేటీఆర్ స‌న్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ‌ అతిపెద్ద‌ కాంస్య విగ్ర‌హం అవిష్క‌ర‌ణ‌కు తాను రావాలేక‌పోయాన‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నీలం మ‌ధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్ తో క‌లిసి మంత్రి కేటీఆర్ ను క‌లిశారు .నీలం మ‌ధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ద‌స‌రా ,దీపావ‌ళీ శుభాకాంక్షులు తెలిపారు.

చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ త‌న‌ను అభినందించిన‌ట్లు నీలం మ‌ధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు  ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago