మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక వహించిన చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ సన్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ అతిపెద్ద కాంస్య విగ్రహం అవిష్కరణకు తాను రావాలేకపోయానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నీలం మధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు .నీలం మధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా ,దీపావళీ శుభాకాంక్షులు తెలిపారు.
చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ తనను అభినందించినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.