_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
_మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయడంతో పాటు పటాన్చెరు పోలీస్ స్టేషన్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.