_పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం ఉదయం 08:30 గంటలకు పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ప్రారంభోత్సవం, 08:45 నిమిషాలకు వార్డు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన, 09:00 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నూతన భవనం ప్రారంభోత్సవం, 09:15 నిమిషాలకు డిసిసిబి బ్యాంకు నూతన భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.