మైత్రిలో ముస్తాబవుతున్న మినీ కైలాసం..

politics Telangana

_50 అడుగుల భారీ శివలింగం.. 15 అడుగుల ధ్యానముద్ర శివుడు..

_వేద బ్రాహ్మణులచే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం

_సినీ కళాకారులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి మహా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారుగురువారం మహా జాగరణ నిర్వహించబోతున్న పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రజలందరూ సామూహికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ ఆ పరమ శివుడిని ధ్యానిస్తూ జాగరణ నిర్వహించాలన్న తలంపుతో మహా జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సాక్షాత్తు పరమశివుడి నివాసమైన కైలాసగిరిని మరిపించేలా పర్వతాలు, 50 అడుగుల శివలింగం, 15 అడుగుల ధ్యానముద్ర శివుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం 6 గంటల నుండి వేద బ్రాహ్మణులచే మహన్యాస అభిషేకం, పల్లకి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, ఎస్పీ చరణ్, సునీత, సుమంగళి, గద్దర్ నరసింహ, మౌనిక యాదవులతోపాటు ప్రముఖ తెలుగు వ్యాఖ్యాత సుమ కనకాల, తెలంగాణ యాస, భాషకు ప్రతిరూపమైన బిత్తిరి సత్తి, తదితర కళాకారులచే సంగీత విభావరి, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తుల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ సదుపాయం, మంచినీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల వాహనాల కోసం సాకి చెరువు కట్ట, ప్రభుత్వ ఆసుపత్రి, బ్లాక్ ఆఫీస్, రహదారి బంగ్లా తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.భక్తులందరూ సకాలంలో కార్యక్రమానికి హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *