డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్చెరు లోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో కాలనివాసుల సొంత నిధులతో నిర్మించుకుంటున్న అంతర్గత డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు సమైక్యంగా సొంత నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు .
తాను కూడా ఈ పనులకు తనవంతు సహాయం అందిస్తామన్నారు కాలనివాసులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటామని ఏ అవసరమైన తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రమణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి, జనరల్ సెక్రెటరీ శివకుమార్, ట్రేసరార్ సురేష్, మహేష్, కాలనీ సభ్యులు అశోక్,డీకే హుస్సేన్,దిలీప్ గౌడ్,శివనాగ్,శ్రీధర్,శ్రీనివాస్ రెడ్డి,నాగరాజు, నంది రెడ్డి,ప్రవీణ్ రెడ్డి, మనీష్ లతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.