పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు పొడగించారని , ఆర్ సి పురం వరకు మాత్రమే పొడిగింపు పరిమితం చేయొద్దని ,పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ వరకు రెండో దశలోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో లైన్ ఇస్నాపూర్ వరకు కచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సత్తన్న తెలిపారు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని అయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో మెట్రో లైన్ మార్గాన్ని కుదించవద్దని కోరారు. నిత్యం వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు తగ్గుతాయని సత్తన్న తెలిపారు అదే విధంగా ఓఅర్ఆర్ శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రెండో దశలో మియాపూర్ – ఇస్నాపూర్ మార్గ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఇదే అంశం పై త్వరలో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ ఈర్ల రాజు మెట్టుశ్రీధర్ చవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు