మెట్రోరైలు ను సంగారెడ్డి వరకు పొడగించాలి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ

Districts politics Telangana

_మెట్రో రైల్ సాధించేవరకు పోరాడతాం

మనవార్తలు,పటాన్‌చెరు:

గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలును పొడగించాలని ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మియాపూర్ ,లింగంపల్లి ,పటాన్ చెరు ,సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువచ్చేందుకు సంగారెడ్డి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు ‌హైదరాభాద్ మెట్రో రైలు సాధన ఉద్యమం కొనసాగుతుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ వెల్లడించారు.

పటాన్ చెరు పట్టణంలో ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ మియపూర్ నుండి పటాన్ చెరు సంగారెడ్డి వరకు మెట్రో రైల్ సాధన కోసం మరో ఉద్యమానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ తెరలేపారు. మెట్రో రైల్ సాధన ఉద్యమంలో భాగంగా ఆదివారం పెద్దయెత్తున ఆయన అనుచరులు, కార్యకర్తలు,ఉద్యమకారులతో జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చి పటాన్ చెరు చౌరస్తా వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మెట్రో రైల్ సాధన కోసం ఉద్యమం చేస్తామని ప్రకటించారు.ఇది ప్రజలకోసమే కాని తన రాజకీయ కోసం కాదని ఈ ఉద్యమం కోసం అన్ని పార్టీల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు.మెట్రో రైల్ సాధించేవరకు ఈ ఉద్యమం అగదని ఇది కేవలం, ఈ ప్రాంతప్రజల ఎజండాగా ముందుకుసాగుతుందని  త్వరలోనే విది విధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం పటాన్ చెరులో హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *