మానసిక ఆరోగ్యం అవశ్యం: వెభైవి

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఆవశ్యమని, దాని గురించి నిరంతరం చర్చించాలని వెభైవి, న్యాయవాది స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హై దరాబాద్ లోని స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘బ్రేవ్ టుగెదర్’ (ధైర్యంగా కలిసి ఉండడం) అనే అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబ్ ల్ లైన్ -న్యూయార్క్ ‘యువా’ల సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, మానసిక ఆరోగ్య అవగాహన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.మానసిక ఆరోగ్యంపై నిరంతర చర్చించాల్సిన ఆవశ్యకతను వెభైవి, స్రస్తానిస్తూ, కళాశాల విద్యార్థులలో గణనీయమైన శాతం ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కొంటున్నట్టు గణాంకాలతో సహా. వివరించారు. బ్రేవ్ విధానాన్ని ఆమె పరిచయం చేస్తూ, వర్తమానంలో ఉండడం, సరైన అమరికను సృష్టించడం, ప్రశ్నలు అడగడం, భావాలను ధృవీకరించడం, చర్యను ప్రోత్సహించడం వంటి దశలను పరిచయం చేశారు.స్వీయ సంరక్షణ కోసం ప్రతిరోజూ పది నిమిషాలు మన కోసం ఏదైనా చేయడానికి కేటాయించడం, చికిత్సను ఒక ఎంపికగా అన్వేషించడం, సవాళ్లకు చురుకుగా పరిష్కారాలను వెతకడం వంటి ఆచరణాత్మక చిట్కాలను వెభైవి, అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి, అవసరమైనప్పుడు మద్దతు కోరేందుకు చురుకెనై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి, వ్యక్తుల నూనసిక ఆరోగ్య ప్రయాణానికి మార్గదర్శనం చేయడానికి విలువైన సూచనలను అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *