_యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి
– ఫ్యాక్టరీస్ ఆప్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు
– సద్వినియోగం చేసుకున్న ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు పేర్కొన్నారు.జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం బీరంగూడ లోని షిరిడి సాయి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ మెగా హెల్త్ చెకప్ క్యాంప్ లో ఎంఎస్ఎన్ పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా క్యాంపుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గోపాలరావు మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే తమ దినచర్య అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. బయట తినే ఆహారం హైజెనిక్ గా ఉండదని, ఇంట్లో వండిన మంచి ఆహారాన్ని భుజించే అలవాటు పెద్దలు అలవాటు చేసుకోవడంతో పాటు తమ పిల్లలకు నేర్పాలన్నారు. ఎపిఐ తయారీ హెడ్ ఎన్ఎన్ వి సుబ్బారావు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ హెచ్ఆర్ హెడ్ పద్మనాభన్, కెఎల్ఎన్ మూర్తి, డాక్టర్ వంశీ కృష్ణన్, డాక్టర్లు, ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…