హైదరాబాద్
పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికున్న ఆస్తి అమ్ముకుని ఖర్చు పెట్టారు. . ఆసుపత్రి బిల్లులు కట్టడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బీహెచ్ఈఎల్ ఎమ్ఐజి లో నివాసముండే ఆ కుటుంబం పేదరికం వల్ల చిన్నారి ప్రాణహాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ప్రణీత ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉండే రామచంద్రపురం ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది అనురాధ ఈ విషయాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు . దేవేందర్ రాజు సహృదయంతో వెంటనే స్పందించి . మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదలకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న ఈ ఫౌండేషన్ ప్రతినిధులను అందరూ ప్రశంసిస్తున్నారు.
