జానపద పాటల సీడీ ఆవిష్కరించిన ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు

Districts politics Telangana

_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం..

–జానపద కళలు ప్రజల గుండె చప్పుడు

అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి జీవన విధానం అనే జానపద పాట సిడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం యూ ట్యూబ్ ప్రసార మాద్యమంలో పాటను ప్రారంభించారు.

ఈ సందర్బంగా  ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ ప్రతి మనిషిలో ఉత్తేజ శక్తిని నింపే మహా శక్తి జానపద కళకు ఉందని అటువంటి జాన పద కళలు మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడని అన్నారు. జానపద కళా సంపదను కాపాడే విధంగా రానున్న తరాలు గుర్తుంచుకే విధంగా పాటలను విడుదల చేస్తున్నందుకు మన ఊరు జానపదం టీంను అభినందించారు. అంతే కాకుండా ఈ పాటను చిత్రీకరించడానికి సూచనలు సలహాలు చేసిన రాఘవరెడ్డి టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మన ఊరి జానపదం ప్రొడ్యూసర్ కుమార్, అజయ్, దర్శకుడు మహావీర్ ఆరుద్ర, కెమెరామెన్ వినయ్ కుమార్ మన్నే, ఎండిఆర్ మధు, ప్రణీత్, వినయ్ గౌడ్, మీడియా సోదరులు నరేష్, నర్సింమ, చారి, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *