మన వార్తలు,పటాన్చెరు
పెద్ద దిక్కు లేని ఓ మహిళ ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ పౌండేషన్ సహకారం అందించింది. పటాన్ చెరు బండ్లగూడలో నివాసం ఉంటున్న వడ్డే ఎల్లమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. గత వర్షాకాలంలో నీరు ఇంటిలోకి వెళ్లి పడుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిన దుస్థితి ఏర్పడింది. ఆమె ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో ఆమె దుస్థితిని ఎండిఆర్ పౌండేషన్, చైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ గారి దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎండిఆర్ పౌండేషన్ ఆమె ఇంటి నిర్మాణానికి 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.