Categories: politics

సామాజిక బాధ్యతను చాటిచెప్పిన ఎంబీఏ విద్యార్థులు

కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమ చిన్నారులతో ఉత్సాహభరితంగా ‘జాయ్ ఆఫ్ గివింగ్’

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యాపార మేళకువలే కాదు, సామాజిక బాధ్యత కూడా తమ మీద ఉందన్న స్ఫూర్తిని చాటేలా గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ ఎంబీఏ విద్యార్థులు గురువారం ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలో ఉన్న ఆనందం) కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, గాజులరామారంలోని కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమానికి చెందిన 44 మంది చిన్నారులు, ఇద్దరు సిబ్బందిని గీతంకు ఆహ్వానించి, రోజంతా వారితో ఆడి పాడుతూ, తమలోని సామాజిక స్పృహ, కరుణలను హృదయపూర్వకంగా ప్రదర్శించారు.అనాథ శరణాలయం వార్డెన్ స్వర్ణలత ఆధ్వర్యంలో చిన్నారులు చిరునవ్వులు చిందించేలా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ ఎంబీఏ విద్యార్థులు అందమైన బహుమతులను అందించి, తమలో మూర్తీభవించిన దాతృత్వం, దయ స్ఫూర్తిని చాటిచెప్పారు. సామాజిక శ్రేయస్సుకు దోహదపడేలా, ఇందులో పాల్గొన్న వారందరిలో ఆశ, సానుకూల భావాన్ని కలిగించారు.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీ-స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తదితరులు పాల్గొని, ఆహూతులందరిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పూజ ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనకు చిన్నారుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఉద్దేశించిన సృజనాత్మకత, ఆనందానికి ఆమె ప్రదర్శన ఉదాహరణగా నిలిచింది. బీ-స్కూల్ అధ్యాపకులు డాక్టర్ నాగప్రియ, డాక్టర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

 

admin

Recent Posts

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 minutes ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago