గీతమ్ లో ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ కోర్సు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ పేరిట కొత్త కోర్సును గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ (ఏఎంటీజెడ్) అకాడమీ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (ఏహెచ్ ఏ)ల సంయుక్త సహకారంతో దీనిని ప్రారంభించినట్టు ఈ కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఐ.బీ.రాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణకు తదుపరి తరం నాయకులను రూపొందించే లక్ష్యంతో ఈ కోర్సును అరంభించానని, ఆరోగ్య సంరక్షణ రంగంలోని చిక్కులతో అధునాతన నిర్వహణ పద్ధతులను ఇది అనుసంధానిస్తుందని డాక్టర్ రాజు తెలిపారు. ఈ రెండేళ్ల పూర్తికాల ఎంబీఏ కోర్సు విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం, పరిశ్రమ-ఆధారిత అభ్యాస అవకాశాలను అందిస్తుందన్నారు. ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కోర్సులతో కోర్ బిజినెస్ సూత్రాలను మిళితం చేసే అంతర్ విభాగ పాఠ్య ప్రణాళికతో ఈ కోర్సును రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో నాయకత్వ పాత్రలకు విద్యార్థులను సిద్ధం చేసే లక్ష్యంతో ఈ విశిష్ట, ఎంబీఏ కోర్సును ప్రారంభించినట్టు డాక్టర్ ఐ.బి.రాజు తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమకు అనుగుణంగా క్లిష్టమైన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపె దృష్టి సారించడంతో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, హెల్త్ కేర్ కన్సల్టెంట్, హెల్త్ కేర్ సర్వీసెస్ మేనేజర్ తో సహా వివిధ పాత్రలను సోషించడానికి తమ పట్టభద్రులు సన్నద్ధులవుతారని పేర్కొన్నారు. ఎంబీఏ హెల్త్ కేర్అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ కోర్సులో ప్రధాన-ఐచ్ఛిక పాఠ్యాంశాలు, బహుళ రంగాలపై అవగాహనతో పాటు ఇంటర్సీస్ అవకాశాలు విద్యార్థులకు చక్కటి విద్యానుభవాన్ని అందిస్తాయని డాక్టర్ రాజు అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్ పరిశ్రమ నిపుణులతో అనుసంధానం కావడానికి ఆరోగ్య పరిరక్షణ రంగంలోని అధునిక ధోరణలతో పాటు ఆ రంగ అభివృద్ధిని కూడా అవగాహన ఏర్పరచుకునే వీలుందన్నారు.ఈ కోర్సు చదవాలనుకునే ఔత్సాహికులకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రారంభించానని, ఆసక్తి గల విద్యార్థులు గీతం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని డాక్టర్ రాజు తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఆర్థిక ఆవసరం ఉన్నవారికి ఉపకార వేతనాలు స్కాలర్ షిప్ అందుబాటులో ఉన్నా యన్నారు. అర్హత, ప్రవేశ వివరాలు, స్కాలర్ షిప్స్ గురించి మరింత సమాచారం కోసం https://apply.gitam.edu/ని సందర్శించాలని లేదా సి. ముల్లేశ్వరరావు 99488 777550 సంప్రదించాలని ఆయన సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *