సేవలను గుర్తించిన మయూరి ఆర్ట్స్…
– రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు అందజేత
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టీ స్టాల్ నిర్వాహకుడు కె. రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు -2022 లభించింది. హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ వారు రవికుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఎక్స్ లెన్స్ అవార్డు ను అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ…. మయూరి ఆర్ట్స్ నుండి ఎక్స్ లెన్స్ అవార్డు, సర్టిఫికేట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.అవార్డు రాక తో మరింత బాధ్యత పెరిగింది అన్నారు. ఇతరులకు సహాయం చేయడంతో ఎంతో ఆనందం కలుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఇతరులకి సాయం చేయాలని చెప్పేవారని వారు చూపిన మార్గంలోనే నడుస్తున్నానని తెలిపారు.