మనవార్తలు,హైదరాబాద్
ఎన్ సి ఎస్ గ్రూప్ (NCS) ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోని మరియు ఎన్ సిఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ లో ఏమంటివి ఏమంటివి టైటిల్ ను ప్రారంభించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ,ఎన్ సి ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజక్ట్ లను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య కలిసి ప్రాజెక్ట్స్ ని ప్రారంభించారు. ‘
ఎన్ సి ఎస్ గ్రూప్ నిర్వహకులు మాట్లాడుతూ ఎన్ సి ఎస్ గ్రూప్ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తుంది. ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ పేరుతో హైదరాబాద్ లోని షాదనగర్ దగ్గర బూర్గుల విలేజ్ లో 75 ఎకరాల్లో మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ పేరుతో విజయవాడ బందరు రోడ్ లోని ఇడుపుగళ్లు లో మరో ప్రాజెక్ట్ ప్రారంభించారు. అంతే కాకుండా మాకు సినిమా పై ఉన్న ప్యాషన్ తో నే ఎన్ సి ఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ ని స్థాపించామని మా బ్యానర్ లో మొట్టమొదటి సినిమా ఏమంటివి ఏమంటివి త్వరలో రాబోతుంది అని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటులు ప్రియాంక, సురభి మరియు సాయి కృష్ణ ,సంస్థ నిర్వహకులు చంద్ర శేఖర్, ఎం బి సత్య నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మరియు శేషు రెడ్డి పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…