రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించి ఆ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. గ్రామాల్లో జరిగే ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసి ఉంటారన్నారు. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కూర్మ వెంకన్న, సుధీర్ రెడ్డి, ప్రభు, వంశీ కృష్ణ, ప్రశాంత్,గణేష్, చంటి, మహేష్, కార్తీక్, అశోక్, మహేష్, ప్రవీణ్, గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
