పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాతరలు ప్రతీక అన్నారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి,ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, శ్రీధర్ చారి, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
