హిమాయత్ నగర్ లో మ్యాక్స్ ఫ్యాష‌న్ రీ లాంచ్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ హైద‌రాబాద్ హిమాయత్ నగర్ ఓం అర్జున్ టవర్స్ లో బుధవారం ప్రారంభమైంది. సువిశాలమైన విస్తీర్ణంగల ఈ నూతన మ్యాక్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ హైదరాబాద్ ఫ్యాషన్ వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా ఉంది. ఇక్కడ అన్నివ‌ర్గాల వారికి అందుబాటులో ధ‌ర‌లు ఉండ‌టం విశేషం. వినియోగ‌దారులు తాము చెల్లించిన ధరకు త‌గిన నాణ్య‌మైన దుస్తులను మ్యాక్స్‌ స్టోర్ల‌లో పొందొచ్చు. కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్‌, ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం, విలక్షణమైన, ప్రత్యేక గొప్ప షాపింగ్ అనుభవం కోసం మ్యాక్స్ స్టోర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా గురించి:

‘రోజువారీ ఫ్యాషన్’ కోసం ప్రసిద్ధి చెందిన మ్యాక్స్ ఫ్యాషన్ భారతదేశంలో అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్  2004లో మిడిల్-ఈస్ట్ లో తన మొదటి స్టోర్ ని ప్రారంభించిన ఈ బ్రాండ్ ఒక అసాధారణ వేగంతో పుంజుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలలో స్టోర్స్ ను కలిగి ఉంది. భారతదేశంలో, ప్రస్తుతం 210+ నగరాల్లో 520+ స్టోర్స్ కలిగి ఉంది. మ్యాక్స్ మిడిల్ ఈస్ట్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా అతిపెద్ద కుటుంబ ఫ్యాషన్ బ్రాండ్. సమకాలీన మధ్యతరగతి ప్రజల కోసం అత్యుత్తమ ఫ్యాషన్‌ను పరిచయం చేసింది. ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా, సరసమైన ధరలకు అందించడం ద్వారా.. ఉత్తమ స్టోర్ గా నిలిచింది. వీరు ఫ్యాషన్ స్పృహతో పాటు టెక్-అవగాహన కలిగి ఉన్నారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం దుస్తులు, పాదరక్షలు వంటివి మ్యాక్స్ లో సరసమైన ధరలకు పొందవచ్చు. మ్యాక్స్ ఫ్యాషన్ అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్‌తో నిజమైన ఓమ్ని-ఛానల్ బ్రాండ్ Maxfashion.com వెబ్‌సైట్ ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లతో మిలియన్ల మంది వినియోగదారులు ఆనందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *