గణితం ఓ ఆలోచనా విధానం , సార్వత్రిక భాష…

politics Telangana

– జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో ట్రిబుల్ ఐటీ ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గణితశాస్త్రం కేవలం సెన్స్డ్ ఒక విభాగం కాదని , ఇది ఓ ఆలోచనా విధానమని , ఇదో తత్వశాస్త్రం , సార్వత్రిక భాష , ప్రకృతి భాషగా ట్రిబుల్ ఐటీ కర్నూలు ప్రొఫెసర్ జి . రాధాకృష్ణమాచార్య అభివర్ణించారు . ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అందించిన సేవలపై అవగాహన కల్పించడానికి , గీతం హెద్దరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్ట్స్ , గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య మాట్లాడుతూ , శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు , గణిత శాస్త్రం విశిష్టతలను గురించి చెప్పారు . మనం ప్రకృతిలో ఏది గమనించినా , వాటిని వివరించడానికి గణితంలో ఒక భావన ఉంటుందని , అందుకే గణితం ప్రకృతి భాష అన్నారు .

గణితం అనేది సెన్స్ అండ్ టెక్నాలజీ భాష అని , అది టెక్నాలజీకి గుండె , ఆత్మ వంటిదిగా ఆయన అభివర్ణించారు . శాస్త్ర , సాంకేతిక ఆవిష్కరణలకు గణితమే ఆధారమని , గణిత శాస్త్రంలో పట్టు సాధిస్తే , ఏ రంగంలోనయినా మరింత సామర్థ్యంతో పనిచేయగలమని డాక్టర్ రాధాకృష్ణమాచార్య పేర్కొన్నారు . శాస్త్ర , సాంకేతిక రంగాలలోని అన్ని విభాగాల వారు గణితం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆయన సూచించారు . గణితాన్ని సరైన దృక్కోణంలో అర్థం చేసుకుంటే , అదే శ్రీనివాస రామానుజన్కు మనం అర్పించే నిజమైన నివాళన్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేషా సభాధ్యత వహించగా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ అతిథిని పరిచయం చేశారు . ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు ముఖ్య అతిథిని సత్కరించారు . గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త కె.కృష్ణ వందన సమర్పణ చేశారు .

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు . ఫజిల్ పోటీలలో వి.సిద్ధార్థ యాదవ్ , వీఎస్ఎం శ్రీకర్ , అనీషాలు బహుమతులను గెలుచుకోగా , పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరిప్రియ లక్ష్మి , పీబీఎస్ఎం సందీప్ , కావ్యశ్రీలు విజేతలుగా నిలిచారు . వారందరికీ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *