ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

Telangana

_రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో నుంచి ఫలితాలు: సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు. రుద్రారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం, గణితశాస్త్రాలను గీతం బీఎస్పీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి.నరసింహ స్వామి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. దీనితోపాటు పదో తరగతి తరువాత ఏ విద్యను అభ్యసించాలనే దానిపై చాలామంది పాఠశాల విద్యార్థులకు అవగాహన లేదని, వారి అభిరుచి తగ్గ మార్గదర్శనం బీఎస్సీ విద్యార్థులు చేస్తున్నట్టు చెప్పారు.కోనిడ్ లాక్టన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని, సురీముఖ్యంగా ఆంగ్లం, గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు. ఆ లోటును కొంతవరకైనా పూచ్చే లక్ష్యంతో గీతం సెర్చ్ విద్యార్థులు గతేడాది నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపారు.

ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నైపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు.తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్ధి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని, తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల రోహిత్, లింగేష్, సూర్య, కృష్ణ, భావన, షాజియాలు అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు. విద్యాబోధనతో పాటు జామెట్రీ కిట్లను కూడా బహుకరించానన్నారు. మరికొందరు విద్యార్థులు కూడా తమ వీలునుబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొస్తున్నారని, ఇతర ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా ఇది సహాయపడొ చ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాల హెడ్మాస్టర్, ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి, తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *