ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

Districts politics Telangana

– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ

మనవార్తలు,పటాన్ చెరు:

పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు . కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని , మరీ ముఖ్యంగా ఆంగ్లం , గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు . ఆ లోటును కొంతవరకైనా పూడ్చే లక్ష్యంతో గీతం సెన్స్డ్ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నెపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు .

తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని , తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల శ్రీపాల్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు . అతనితో పాటు ఎ.సూర్యవంశీ , డి.అక్షయ్ , బి . ధనుష్యరెడ్డి , కె . జాహ్నవి , వి . అభిజిత్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు . పాఠశాల హెడ్మాస్టర్ , ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి , తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *