శేరిలింగంపల్లి :
గణేష్ నవరాత్రుల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల,శ్రీ గణపతి మహిళా స్వశక్తి సంఘం, కాలనీ వాసుల ఆధ్వర్యంలో నెలకిల్పిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యం వివిధ పూజా కార్యక్రమాలతో పాటు పిల్లలకు పెద్దలకు గేమ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బిసి సంఘం నాయకులు భేరి రాంచందర్ యాదవ్, నర్సింలు ముదిరాజ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్, మియాపూర్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఇలియాజ్ షరీఫ్, బీజేపీ కాంటెస్టెడ్ కార్పోరేటర్ రఘునాథ్ యాదవ్, నాయకులు కృష్ణ గౌడ్, రాజేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, కాలనీ వాసులు రామకృష్ణ, శ్రీకాంత్, సంఘం సభ్యులు పాల్గొన్నారు