పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులోని అత్తాపూర్ సంఘం కార్యాలయంలో వడ్డే సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంజల దస్తగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంవుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించిన పెద్దలందకి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ,కాంట్రాక్టులో 20 శాతం పనులు కేటాయించాలని, వడ్డెరలు రాజకీయాల్లోనూ ఎదగాలని, మన హక్కుల సాధనకై డిమాండ్లకు కృషి చేస్తానని , జిల్లాల్లో పర్యటనలు జరిపి కులస్తుల జీవన విధానంపై అధ్యయనం చేస్తానని తెలిపారు, వడ్డెర కులస్థులను ఎస్టీజాబితాలో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లెపు మొగలి, జాతీయ ఉపాధ్యక్షులు జరపటి ఈశ్వర్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పల్లెపు శివకుమార్,మంజలి యాదగిరి , మంజలి హనుమంతు ,స్వామి ,ఎల్లేష్ ,నాగేష్ ,హాభీరామ్ ,వీరేష్ ,భీమయ్య ,తదితరులు పాల్గొన్నారు.