మణిరత్నం సినిమాయే నాకు ప్రేరణ

Telangana

గీతం Tedx లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతమ్ మీనన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నాయగన్’ సినిమా తాను ఆ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్నవాటిని తన సినిమాలలో కూడా ప్రతిబింబించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ చెప్పారు. గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ‘రివెండ్ ద మిల్లీనియమ్’ ఇతివృత్తంతో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ప్రసిద్ధ టెన్ఎక్స్ ఒకరోజు కార్యక్రమంలో ఆయన ఉపన్యసించారు. తాను కళాశాల రోజులలో అల్లరి విద్యార్థిగానే ముద్రపడ్డానని, కళాశాల నుంచి సస్పెండ్ అయ్యానని, నాలుగున్నరేళ్లలో బీటెక్ డిగ్రీ చేతికొచ్చిందని, అయితే విద్యార్థులెవరూ దానిని అనుకరించవద్దని విజ్ఞప్తి చేశారు. తాను అనుకున్నదే తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. తన చిత్రానికి జాతీయ అవార్డును ఎలా గెలుచుకున్నాడనే అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవడం ద్వారా తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ కథ రాయడానికి ఎంత కష్టపడింది. అదే సమయంలో తన తండ్రిని కోల్పోయినట్టు చెప్పారు.జీవితంలో విజయం సాధించడానికి మూడు మంత్రాలను ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి విద్యార్థులకు చెప్పారు.

కష్టించకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నైపుణ్యం సాధించాలంటే పూర్తిగా దానిపై దృష్టిని కేంద్రీకరించాలని, ఆ తరువాత ప్రేక్షకుల అభిరుచి మేరకు వినూత్నంగా ప్రదర్శించాలని హితవు పలికారు. తాత్కాలిక పొగడ్తల కంటే అత్యంత కఠినమైన, నిజమైన విమర్శకుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, మార్పును అందిపుచ్చుకోవాలన్నారు.పెద్దలు మౌఖికంగా పిల్లలకు చెప్పే కథలను పూర్తిగా విశ్వసించకపోయినా, వాటిని మననం చేసుకుంటూ తరువాతి తరాలకు వాటిని అందించాలని ప్రసిద్ధ చరిత్రకారుడు సాజాద్ షాహీద్ సూచించారు.
అనుకున్నది సాధించేవరకు విశ్రమించకూడదని, సాధనను కొనసాగిస్తూనే ఉండాలని ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీష్ కొండపర్తిహితబోధ చేశారు.

ఒకసారి విజయం సాధించాక గోడలు తలుపులుగా మారతాయని, విమర్శించిన వారే అభిమానులవుతారని,ద్వేషించేవారు ప్రేమిస్తారని చెప్పారు.మిస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనింగ్లో అవార్డు గ్రహీత శిల్పారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినా, వీడియో సందేశాన్ని పంపారు. సుస్థిర భవిష్యత్తు కోసం కట్టుబడదామని ఆమె పిలుపునిచ్చారు.స్క్రిప్ట్ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రవి కాబ్రా తాను జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను వివరిస్తూనే, ఎదగాలనే కాంక్షను ఎట్టి
పరిస్థితులలోనూ విస్మరించకూడదని సూచించారు. ఆకాశమే హద్దుగా పెకైగిరితే, కనీసం చెట్టుపైన అయినా పడతామన్న సామెతను ఉటంకిస్తూ, తండ్రి వారసత్వంగా చేపట్టిన వ్యాపారంలో చేసిన పొరపాట్లు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, చివరకు విజయవంతమైన వ్యవస్థాపకుడిగా ఎదిగిన తీరుతెన్నులను వివరించారు. ఎవరెనా తప్పులు చేయడం అనివార్యమని, అయితే అని పునరావృత్తం కాకుండా చూసుకోవాలన్నారు. అదృష్టం అంటే కష్టపడాలని, కఠోర పరిశ్రమ, పట్టుదలతోనే ఏదైనా సాధించగలమని చెప్పారు.

తొలుత ఈ కార్యక్రమాన్ని గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు లాంఛనంగా
ప్రారంభించారు. గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డెరైక్టర్లు, వివిధ విభాగాధిపతులు, దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వంద నుంది ప్రతినిధులు ఈ టెడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *