మనవార్తలు ,హైదరాబాద్:
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచు అని మనసానుచూసి నేర్చుకోవచ్చుఅని అంతే కాకుండా ఇండియాలో ని మొట్టమొదటి మహిళల కొసం వింటేజ్ స్టైల్ స్కిన్ మరియు హెయిర్ స్టైల్ యంగ్ లో హైదరాబాద్ లోనే మొట్టమొదటి స్టూడియో అంతే కాదు మనసా ఏంతో మంది నిరుపేద బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి మరింత సేవ చేయాలని ఉందని ఆమె తెలిపారు .
నగరానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్. లక్ష్మి మంచు, ప్రగ్యా జైస్వాల్, ప్రణితి, ఛార్మీ, ప్రియమణి తదితర ప్రముఖుల మేకప్ మరియు మేక్ఓవర్లు చేశారు. ఆమె హైదరాబాదులోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. పెళ్ళి కూతురిని ముస్తాబు చేయడంలో మనసా లెజెండ్ అని .మేకప్ రంగంలో ఎనో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న తెలంగాణ మొదటి మహిళా అని మనసా ధనలక్ష్మి తెలిపారు.