మన ఊరు-మన బడి..విద్యారంగంలో నవ శకానికి నాంది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

_ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారంలలో

_మన ఊరు మన బడి పథకం ప్రారంభం

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు

మనవార్తలు,పటాన్ చెరు:

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకం విద్యావ్యవస్థలో నవ శకానికి నాంది పలుకుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు మన బడి పథకం ద్వారా 58 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో మూడు దశల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు.

ప్రధానంగా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ , గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు నియోజకవర్గంలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు నుండి సి ఎస్ ఆర్ ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సువర్ణ మాణిక్ రెడ్డి, గడ్డం బాలమణి శ్రీశైలం, దండు నర్సింలు, మండల విద్యాధికారి రాథోడ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *