మనవార్తలు ,పటాన్ చెరు:
మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా 22 లక్షల 80 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.
సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం అని విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో ఏర్పాటవుతాయన్నారు. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచ్ ఉమవతి గోపాల్, ఎంపీటీసీ నాగ జ్యోతి లక్ష్మణ్, మండల విద్యాధికారి రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.