అమీన్పూర్:
సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించబోయే టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. జెండా పండుగ ఏర్పాట్లపై సోమవారం ఉదయం తన నివాసంలో మున్సిపల్ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డు లు, ప్రతి కాలనీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల తో కలిసి జెండా ఎగురవేయాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ , వార్డు కౌన్సిలర్స్ , కో ఆప్షన్ సభ్యులు , టిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…