_ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరు గారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైనా గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోనికి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుట పథకం తదితర పథకాల లబ్ధి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తరతకుండా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని సంపూర్ణంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.