పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలను జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ ను దేశంలోని నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన గురు తన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ నెల 28 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు పటాన్చెరు మండల ఆత్మీయ సమావేశాన్ని పార్టీ చౌరస్తాలోని ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం నుండి పండుగ వాతావరణం లో కార్యకర్తలు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పాండు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…