గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి :

మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు స్థానిక బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పై చేసిన దాడిని నిరసిస్తూ సోమవారం రోజు మాదాపూర్ డివిజన్ కాoటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఖానామేట్ చౌరస్తాలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం రాధా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన నీకు అంత అధికారం మదం అహంకారం గర్వం ఉండకూడదని,అలాగే పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే నిరసన తీవ్రతరo చేస్తామని హెచ్చరించారు.

 

బండి సంజయ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధులు అయిన గాంధీజీ ఫోటోలను తన్నుతూ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పై బీరు బాటిల్స్ తో దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అరికట్టాలని, ఇదంతా కేసీఆర్ డైరెక్షన్లోనే జరుగుతుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనంపల్లి చేసిన భూకబ్జాలు భూ దందాలు అలాగే నాలాలపై ఫంక్షన్ హాల్ నిర్మించి అమ్ముకున్న దౌర్జన్యాలు బయటపడతాయని, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా బండి సంజయ్ మీద ఎదురు విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమం లో మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మధుయాదవ్,ప్రధాన కార్యదర్శులు మదనాచారి, శివ శ్రీనివాస్, కార్యదర్శులు గోవర్ధన్ రెడ్ది, కొండయ్య,ఓబీసీ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యం చారి మరియు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు చంద్రకళ మరియు ప్రధాన కార్యదర్శి భారతి, మరియు బీజేవైఎం అధ్యక్షులు ఆనంద్, కార్యదర్శి నరేష్ రెడ్డి, శివాయాదవ్, గంగాధర్, కొండయ్య యాదవ్, దీపాల కొండయ్య, ఎస్టీ సెల్ నాయకులు బాలు నాయక్, కృష్ణ నాయక్, నాగరాజు,మరియు బాలమ్మ,మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *