పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని , రామచంద్రపురం డివిజన్ గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి, ప్రపంచానికి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు.మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు నేటి ప్రపంచంలో ఆయన బోధనలు, సూత్రాల ప్రాముఖ్యతను, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని షేక్ అబ్దుల్ ఖదీర్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి సెక్రెటరీ షేక్ అబ్దుల్ గని, షేక్ అబ్దుల్ గఫార్, సయ్యద్ అక్బర్, ఎండి మోయిన్, రమేష్, విజేందర్, అబ్దుల్ సత్తార్,షౌకత్ తదితరులు పాల్గొన్నారు.