ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి _బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్

Districts politics Telangana

మనవార్తలు .నల్గొండ :

మహర్షి వాల్మీకిని ఆదికవి అని కూడా అంటారు అంటే మొదటి కావ్య రచయిత అని అర్థం రామాయణం వంటి మొదటి ఇతిహాసం ఇతనే రచించినందున ఆదికవి అని సంబోధించబడ్డాడు అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీమోర్చా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొని మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి వాల్మీకి గొప్ప కవి కావడమే కాకుండా రామాయణంలో చాలా ప్రదేశాలలో సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రరాశులను సరిగ్గా లెక్కించినందున గొప్ప పండితుడు కూడా అతనికి జ్యోతిష్యం మరియు ఖగోళ శాస్త్రంలో కూడా మంచి పరిజ్ఞానం ఉందని ఇది చూపిస్తుంది,పురాణాల ప్రకారం మహర్షి కాకముందు వాల్మీకి పేరు రత్నాకర్ మరియు అతను ఒక దోపిడీదారు ఒకసారి అతను నారద మునిని ఎదుర్కొని అతని మాటలు విన్నప్పుడు రత్నాకర్ కళ్ళు తెరిచాడు మరియు అతను సత్య మరియు ధర్మ మార్గాన్ని అవలంబించాడు అతని కృషి మరియు తపస్సు బలంతో అతను రత్నాకర్ నుండి వాల్మీకి మహర్షి అయ్యాడు అని అన్నారు.

ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి చింతా ముత్యాలరావు ,బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భవాని ప్రసాద్, ఎస్సీమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శేపూరి శ్రీనివాస్, కార్యదర్శి మామిoడ్ల శ్రీనివాస్, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ముడ్సు భిక్షపతి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు కిషన్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు తండు బిక్షమయ్య గౌడ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *