” రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు, ఇక్రిశాట్ సమీపంలోని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నేటి నుండి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండి నుంచి వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, నీటి వసతి, విద్యుత్ దీపాల వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శనివారం అఖండ దీపారాధన, ధ్వజారోహణం ,గణపతి పూజ, అభిషేకం శివ స్వాముల ఇరములు ,అన్న ప్రసాద వితరణ ఆదివారం మహాశివరాత్రి రోజున ఉదయం 3 గంటల నుండి తొలి పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ఉదయం 6 నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు సామూహిక అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక అలంకారము సాయంత్రం 7:00 నక్షత్ర హారతి 7:30 గంటలకు నటరాజ కళాక్షేత్రం వారిచే నాట్య ప్రదర్శన లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం, సోమవారం రోజున ఉదయం 8:00 గంటలకు స్వామి వారి కల్యాణం, అన్న ప్రసాద వితరణ సాయంత్రం పల్లకి నిర్వహించినట్లు తెలిపారు.

ఆలయ చరిత్ర

పటాన్ చెరు సమీపంలోని శ్రీ మంజీర క్యాంపస్ లో మొట్టమొదటిగా 1976 సంవత్సరంలో కీర్తిశేషులు దైవజ్ఞులు శ్రీశైలం పంతులు ఈ దేవస్థానం స్థలంలో శ్రీ అంజనేయ స్వామి విగ్రహం లభ్యమైనది శ్రీశ్రీ మడుపతి శ్రీశైలం పంతులు తన శక్తికొలది చిన్ని ఆలయం ఏర్పాటు గావించారు. కొంతకాలానికి మల్లేపల్లి మటం సందయ్యచే నేడు దర్శనమిస్తున్న ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ గావించారు కాలక్రమేణా శ్రీశైలం పంతులుకి స్వప్నంలో శ్రీ రామలింగేశ్వరస్వామి సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో తనకు ఒక ఆలయం నిర్మింపజేయమని ఆదేశించారు. నాటి నుండి శ్రీశైలం పంతులు పవిత్ర హృదయంతో భక్తితో అకుంఠిత దీక్షతో సేవా కృషితో అహోరాత్రులు కృషి చేయగా ఆయన స్వప్నం సహకారమగుటకు మంజీరా వాటర్ వర్క్స్ అధికారులు ఉద్యోగులు, భక్తుల సహాయ సహకారాలతో ఈ ప్రాంగణంలో 1986 నాటికి ఆలయం రూపుదిద్దుకుంది. నాటినుండి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారు విరాజిల్లుతున్న సంతానం, ఉద్యోగం, విదేశీయానం వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు దేవస్థాన ప్రాంగణంలో ముడుపుకట్టి 16 సోమవారాలు స్వామివారిని పూజించిన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *