politics

క్యాన్సర్‌ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …

పటాన్ చెరు:

‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ పరిశోధనలో నూతన క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను అభివృద్ధి చేయడం , క్యాన్సర్ గుర్తించి క్లుప్త అధ్యయనాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు . కీమోథెరపీ ఔషధాల ఆవశ్యకత ఆధారంగా , అధిక శక్తి , కనీస దుష్ప్రభావాలున్న ఇమిడాజో పిరిడిన్ , సిరిమిడిన్ , డయాజాస్పిరో వంటి మూడు నూతన శ్రేణి ఔషధాలను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు . వీటిని ప్రయోగించి చూడగా , 47 అణువులలో 12 అద్భుతమైన క్యాన్సర్ నిరోధక చర్యను ప్రదర్శించినట్టు తెలియజేశారు .

మధుసూదనరెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

ఇవి చదవండి

గీతంలో బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago