మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గల మాదాపూర్ డివిజన్ లోని మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్కులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత నమోదు నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాధాకృష్ణ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు బిజెపి పార్టీ యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభను తన మాటల్లో వివరించారు. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా 2000 కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించగలిగే అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపి పార్టీని బలోపేతం చేసే విషయంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం రాధాకృష్ణ యాదవ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, బిజెపి స్థానిక నాయకులలో,పార్టీ శ్రేణులలో,బిజెపి కార్యకర్తలలో, ఉత్సాహాన్ని నింపే విధంగా వారితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ద్వారా కాలనీ వాసులను, స్థానికులను కలుస్తూ పలు సభ్యత్వాలు నమోదు చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ నాయకులు ప్రశoశించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిషన్ నాయకులు సూర్ణ శ్రీశైలం కురుమ, రంజిత్ కుమార్, మహేష్ రవ్వ, సత్యనారాయణ, అల్లాడి ప్రవీణ్, ముఖేష్, వంశీ, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు…