వినాయక ప్రసాదం దక్కించుకున్న 9 ఎ బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ :

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్‌–1లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. వేలం పాటలో పెద్ద లడ్డూను 9A బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రూ.80,500లకు సొంతం చేసుకున్నారు. అలాగే సెకండ్ లడ్డూను 12B బ్లాక్‌కు చెందిన సంతోష్ రూ.42,000లకు దక్కించుకున్నారు. వేలం పాట సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *