గీతం హెదరాబాద్లో ఎం.ఫార్మశీ అడ్మిషన్లు…

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ( ఎస్వోపీ ) లో ఈ విద్యా సంవత్సరం ( 2022-23 ) నుంచి ఎం.ఫార్మశీ కోర్సుల నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు . ఫార్మాస్యూటిక్స్ , ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఎం.ఫార్మ్లో ప్రవేశాల కోసం గీతం నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష ( గాట్ – పీజీపీ ) లో అర్హత సాధించాలని ఆయన సూచించారు . జీపాట్లో అర్హత సాధించిన విద్యార్థులు నెలకు రూ .12,500 స్కాలర్షిప్ పొందడానికి అర్హులని తెలిపారు . ఇతర వివరాల కోసం 08455-221401 / 402 లేదా 95424242 56/59 సంప్రదించాలని సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *